తమ్మారెడ్డి భరద్వాజ తల్లి మృతి.. ఫోన్ లో పరామర్శించిన చిరంజీవి

06-04-2020 Mon 19:38
  • తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి (94) 
  • ఆమెకు కొంతకాలంగా అనారోగ్యం
  • లాక్ డౌన్ కారణంగా పరామర్శించేందుకు ఎవరూ రావొద్దన్న భరద్వాజ
Chiranjeevi consolates Tammareddy Bharadwaja

ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి (94) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు తుదిశ్వాస విడిచినట్టు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. గత రెండు నెలలుగా తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న తన మిత్రులు, శ్రేయోభిలాషులు తనకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్నందున తనను పరామర్శించే నిమిత్తం ఎవరూ తన ఇంటికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, ఈ విషయం తెలుసుకున్న హీరో చిరంజీవి, తమ్మారెడ్డి భరద్వాజకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.