ఏపీలో 300 దాటిన కరోనా పాజిటివ్ కేసులు... కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం!

06-04-2020 Mon 19:11
  • కొత్తగా 37 కేసుల నమోదు
  • కర్నూలు జిల్లాలో ప్రబలంగా ఉన్న కరోనా
  • జిల్లాలో కొత్తగా 18 కేసులు
Corona positive cases toll crosses three hundred in AP

ఏపీలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఈ ఉదయానికి 266 గా ఉన్న కరోనా బాధితుల సంఖ్య సాయంత్రానికి 300 దాటింది. ప్రస్తుతం అధికారిక గణాంకాల ప్రకారం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 303. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు మరణించారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. అటు, కర్నూలు జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతోంది. అక్కడ మరో 18 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74కి చేరింది. నెల్లూరు జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇవాళ కొత్తగా 8 పాజిటివ్ కేసులను గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 42 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.