శ్రీలక్ష్మి కనకాల మృతిపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

06-04-2020 Mon 18:18
  • క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూసిన శ్రీలక్ష్మి కనకాల
  • శ్రీలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు
  • ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు
Chandrababu responds on Srilakshmi Kanakala death

నటుడు రాజీవ్ కనకాల సోదరి, ప్రముఖ టీవీ నటి శ్రీలక్ష్మి కనకాల క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. శ్రీలక్ష్మి మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీలక్ష్మి కనకాల అనేక పాత్రలతో టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. బుల్లితెర రంగంపై ఆమె చెరగని ముద్ర వేశారని కొనియాడారు. కాగా, శ్రీలక్ష్మి కనకాల కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇవాళ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆమె భర్త పెద్ది రామారావు ప్రముఖ పాత్రికేయుడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.