ఫిలిప్పీన్స్ లో రోడ్డు ప్రమాదం... ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం

06-04-2020 Mon 17:45
  • అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
  • వంశీ, రేవంత్ కుమార్ మృతి
  • మృతులు అనంతపురం జిల్లాకు చెందినవారిగా గుర్తింపు
Two Telugu students died in a road mishap in Philippines

ఫిలిప్పీన్స్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువకులు దుర్మరణం చెందారు. వారిద్దరినీ అనంతపురం జిల్లాకు చెందిన వంశీ, రేవంత్ కుమార్ గా గుర్తించారు. ఆ ఇద్దరూ ఫిలిప్పీన్స్ లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. వారి మృతదేహాలను స్వస్థలాలకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోపక్క, ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఫిలిప్పీన్స్ లో అనేకమంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు.