‘లాక్ డౌన్’ పై వస్తున్న వదంతులను నమ్మొద్దంటున్న పీఐబీ

06-04-2020 Mon 17:12
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరిట వదంతులు
  • భారత్ లో ఆరు అంచెల్లో లాక్ డౌన్ అంటూ పుకార్లు
  •  ప్రభుత్వ మీడియా సంస్థ పీఐబీ వివరణ
Central Government requests citizens that do not believe rumours about lock down

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియాల్సి ఉంది. అయితే, దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని వదంతులు వ్యాపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఓ) ఆగ్నేయాసియా విభాగం ప్రకటన మేరకు భారత్ లో ఆరు అంచెల్లో లాక్ డౌన్ కొనసాగుతుందంటూ ఈ వదంతులు సృష్టిస్తున్నారు. ఈ వదంతులపై ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది. ఈ వదంతులను నమ్మొద్దని, ఇవన్నీ అబద్ధమని స్పష్టం చేసింది.