పార్టీకి వెళ్లాననే వార్తలు నిజం కాదు: 'కెవ్వుకేక' హీరోయిన్

06-04-2020 Mon 16:20
  • బెంగళూరులో రోడ్డు ప్రమాదానికి గురైన షర్మిలా మాండ్రే
  • పార్టీకి వెళ్లి, జాలీ డ్రైవ్ కు వెళ్లిందంటూ వార్తలు
  • ఆసుపత్రికి వెళ్లానని తెలిపిన షర్మిల
Actress Sharmeiela Mandre response on road accident

సినీ నటి షర్మిలా మాండ్రే రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బెంగళూరులోని వసంతనగర్ రైల్వే అండర్ పాస్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే షర్మిల తన ఫ్రెండ్ తో కలిసి పార్టీ చేసుకుందని... జాలీ డ్రైవ్ కు వెళ్లిందని, ఆ సందర్భంలోనే ఆమె యాక్సిడెంట్ కు గురైందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై షర్మిల స్పందిస్తూ, తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.

పార్టీ చేసుకునేందుకు తన మిత్రుడితో కలిసి బయటకు వెళ్లలేదని... ఆసుపత్రికి వెళ్లినప్పుడు అనుకోకుండా ప్రమాదం జరిగిందని షర్మిల చెప్పింది. కొంచెం కడుపు నొప్పి ఉండటంతో తన స్నేహితులు లోకేశ్, డాన్ థామస్ లతో కలిసి సమీప ఆసుపత్రికి వెళ్లానని తెలిపింది. డాన్ థామస్ కారును డ్రైవ్ చేశాడని... ఆ సమయంలో కారు ప్రమాదానికి గురైందని  చెప్పింది.

షర్మిల మాండ్రే తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది. కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. తెలుగులో అల్లరి నరేశ్ సరసన 'కెవ్వుకేక' చిత్రంలో నటించింది.