ఈ నాలుగు దశాబ్దాల కాలంలో దేశం నలువైపులా బీజేపీ విస్తరించింది: ‘జనసేన’ నేత పవన్ కల్యాణ్ ప్రశంసలు

06-04-2020 Mon 16:12
  • ఈరోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
  • బీజేపీకి రూపకల్పన చేసిన పెద్దలను గుర్తుచేసుకున్న పవన్
  • బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు శుభాకాంక్షలు చెబుతూ ప్రకటన
Janasena Leader pawan kalyan praises BJP

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన బీజేపీని స్థాపించారని, నేటికి నలభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.

బీజేపీకి రూపకల్పన చేసిన అటల్ బిహారీ వాజ్ పేయి, అద్వానీ, బైరాన్ షింగ్ షెకావత్ వంటి రాజకీయ యోథులకు మన స్ఫూర్తిగా నమస్కరిస్తున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో దేశం నలువైపులా విస్తరించిన బీజేపీ, ప్రజల పార్టీగా ఆవిర్భవించిందని, ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని కొనియాడారు. వ్యవస్థాపక నేతల ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా,  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఇలా ఒకరేమిటి ఆ పార్టీలో అంతర్గతంగా పనిచేస్తూ బీజేపీని ప్రజలకు మరింత చేరువ చేస్తున్న ప్రతిఒక్కరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.