అప్పుడు చిరంజీవి ఏమనుకుంటారోనని భయపడిపోయాం: బాబూ మోహన్

06-04-2020 Mon 15:54
  • నేను .. బ్రహ్మానందం బిజీ 
  • 'ముఠామేస్త్రి'కి డేట్స్ లేవు 
  • చిరంజీవి అలా చేశారన్న బాబూ మోహన్
Babu Mohan

హాస్యనటుడిగా బాబూ మోహన్ కి మంచి పేరు వుంది. ఎన్నో విభిన్నమైన పాత్రలతో నవ్వులు పూయించారాయన. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. 'ముఠామేస్త్రి' సినిమా షూటింగు జరుగుతున్న రోజులవి. చిరంజీవిగారి కాంబినేషన్లో నాకు .. బ్రహ్మానందంగారికి సీన్స్ వున్నాయి. అయితే నేను .. బ్రహ్మానందం బిజీగా ఉండటం వలన డేట్స్ సర్దుబాటు కావడం లేదు.

చివరికి తెల్లవారు జామున 4 నుంచి 6 గంటలలోపు కుదురుతుందని అంటే, ఆ సమయానికే షూటింగు పెట్టారు. చిరంజీవిగారు ఏమనుకుంటారో .. ఆ సమయానికి షూటింగుకి వస్తారో లేదో అని భయపడ్డాం. అయితే తెల్లవారు జామున నేను షూటింగుకి వెళ్లేసరికి చిరంజీవిగారు మేకప్ చేయించుకుంటున్నారు. షూటింగు అయ్యాక మాకు ఇంటి నుంచి తెప్పించిన టిఫిన్ పెట్టి పంపించారు" అని చెప్పుకొచ్చారు.