మొన్నటి నుండి ఒకటే అరుస్తున్నారు... కాస్త బుర్ర వాడండి: అంబటి చురక

06-04-2020 Mon 15:09
  • నాగబాబు, సుజనా చౌదరిలను టార్గెట్ చేసిన అంబటి
  • బీజేపీలో చేరిన కొత్తనీరు అంటూ  పరోక్ష వ్యాఖ్యలు
  • అవాస్తవాల ప్రచారం ఆపాలంటూ సూచన
Ambati Rambabu fires on Nagababu and Sujana Chowdary

మెగాబ్రదర్ నాగబాబు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిలను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బీజేపీలో చేరిన కొత్త నీరు మొత్తం మొన్నటి నుండి ఒకటే అరుస్తోంది అంటూ ట్వీట్ చేశారు. కేంద్రం రూ.1000 ఇచ్చిందని చెబుతున్నారని, ఇకనైనా కాస్త బుర్ర వాడాలని హితవు పలికారు. కేంద్రం ఇచ్చిన డబ్బు సరాసరి అకౌంట్లో జమ అవుతుందని పేర్కొంటూ, ఓ అకౌంట్లో రూ.500 జమ అయినట్టు బ్యాంకు నుంచి వచ్చిన సందేశం తాలూకు స్క్రీన్ షాట్ ను పోస్టు చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పిచ్చి పచ్చ రాజకీయ అవాస్తవాల ప్రచారం ఆపాలని సూచించారు.