‘సిటిజెన్ హీరోస్’ అంటూ ఒకే కుటుంబంలోని ముగ్గురు వైద్యులపై కేటీఆర్ ప్రశంసలు

06-04-2020 Mon 14:44
  • వైద్యసేవలందిస్తున్న భార్యాభర్తలు, వారి కూతురు
  • ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని పోస్ట్ చేసిన కేటీఆర్
  • ‘కరోనా’పై పోరాడేందుకు తమను తాము అంకితం చేసుకున్నారంటూ ప్రశంసలు
Minister Ktr Praises three doctors in the same family

కరోనా వైరస్ బారిన పడ్డ రోగులకు ఓ కుటుంబంలోని ముగ్గురు వైద్యులు సేవలందిస్తుండటంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించి ఓ వార్తాపత్రికలో ప్రచురితమైన కథనాన్ని చదివిన కేటీఆర్ స్పందిస్తూ, ఓ ట్వీట్ చేశారు. ఆ వార్తా కథనాన్ని కూడా జతపరిచారు. వారి సొంత భద్రత గురించి పట్టించుకోకుండా, డాక్టరు మహబూబ్ ఖాన్, ఆయన భార్య డాక్టరు షహానా ఖాన్, వారి కుమార్తె డాక్టరు రషికా ఖాన్ లు ‘కరోనా’ బాధితులకు వైద్య సేవలందిస్తున్నారని, ఆ మహమ్మారిపై పోరాడేందుకు తమను తాము అంకితం చేసుకున్నారని కొనియాడారు.