పవన్ .. క్రిష్ సినిమాలో అనుష్క?

06-04-2020 Mon 14:15
  • క్రిష్ నుంచి మరో చారిత్రక చిత్రం 
  •  రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్
  • గతంలో 'వేదం' చేసిన అనుష్క
Viroopaksha Movie

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఒక చారిత్రక చిత్రాన్ని రూపొందించడానికి క్రిష్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆంగ్లేయుల కాలంతో ముడిపడిన కథ ఇది. 'విరూపాక్ష' టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని అంటున్నారు.

ఈ సినిమాలో కథానాయిక పాత్రకిగాను కీర్తి సురేశ్ పేరు వినిపించింది. ఆ తరువాత జాక్విలిన్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా అనుష్క పేరు వినిపిస్తోంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క 'వేదం' సినిమా చేసింది. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. పవన్ సినిమాలో అనుష్క అయితే సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశంతో క్రిష్ ఆమెను తీసుకున్నాడని అంటున్నారు. ఇక జాక్విలిన్ ను ప్రత్యేకమైన పాట కోసం గానీ .. ప్రత్యేక పాత్ర కోసం గాని తీసుకున్నారేమో తెలియాల్సి వుంది.