అలా సీరియల్స్ వైపు వచ్చాను: 'మౌనరాగం' నటి ప్రియాంక

06-04-2020 Mon 13:12
  • నేను పుట్టింది ముంబైలో 
  • కన్నడ మూవీలో చేశాను 
  • 'మౌనరాగం' మంచి గుర్తింపు తెచ్చిందన్న ప్రియాంక 
Mouna Ragam Serial

'మౌనరాగం' ధారావాహిక చూసేవారికి ప్రియాంకను గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. బుల్లితెరపై నాజూగ్గా కనిపించే ప్రియాంకకి పెద్ద సంఖ్యలోనే అభిమానులు వున్నారు. నిజంగానే ఈ అమ్మాయి మూగదేమో అన్నంత సహజంగా నటిస్తూ మంచి మార్కులు కొట్టేసింది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "మాది ముంబై .. ఆ తరువాత కొంత కాలానికి బెంగళూర్ వచ్చాము. ముంబైలో ఉండగానే యాడ్స్ లో నటించే ఛాన్స్ వచ్చిందిగానీ చేయలేదు. బెంగళూర్ వచ్చాక కన్నడ సినిమా 'గోలీమార్'లో నటించే అవకాశం రావడంతో చేశాను. ఆ తరువాత తెలుగులో 'చల్తే చల్తే' సినిమా చేశాను. ఈ నేపథ్యంలోనే 'మౌనరాగం' సీరియల్లో చేసే ఛాన్స్ వచ్చింది. ఈ సీరియల్ ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా వుంది" అని చెప్పుకొచ్చింది.