Amitabh Bachchan: లక్ష మంది సినీ కార్మికులకు నెలవారీ రేషన్ ఏర్పాటు చేస్తున్న అమితాబ్

 Amitabh Bachchan to provide monthly ration to 1 lakh daily wage workers
  • లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు అండగా బిగ్ బీ
  • సోనీ పిక్చర్స్, కల్యాణ్ జ్యువెలర్స్‌తో కలిసి సాయం చేయాలని నిర్ణయం
  • దేశ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్, టీవీ కార్మికులకు సరుకులు
కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటంలో సాయం చేసేందుకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముందుకొచ్చారు. వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు నడుం బిగించారు. తన వంతుగా లక్ష కుటుంబాలకు సాయం చేస్తానని ప్రకటించారు. ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్‌లో సభ్యులుగా ఉన్న లక్షమంది దినసరి సినీ కార్మికుల కుటుంబాలకు నెలవారీ రేషన్‌ను అందిస్తామని చెప్పారు.

అమితాబ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి సోనీ పిక్చర్స్ నెట్ వర్క్, కల్యాణ్ జ్యువెల్లర్స్ అండగా నిలుస్తున్నాయి. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్ నెట్‌ వర్క్ ధ్రువీకరించింది. దేశ వ్యాప్తంగా ఉన్న లక్ష మంది ఫిల్మ్, టెలివిజన్ కార్మికుల కుటుంబాలకు సాయం చేస్తామని ప్రకటించింది. అయితే, ఆ కుటుంబాలకు ఎప్పటి నుంచి రేషన్ సరుకులు అందిస్తారన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు. సోనీ పిక్చర్స్ తరఫున కనీసం యాభై వేల మంది కార్మికులు, వారి కుటుంబాలకు ఒక నెల సరుకులు ఇస్తామని ఆ సంస్థ సీఈవో ఎన్పీ సింగ్ తెలిపారు.
Amitabh Bachchan
provide
monthly
1lakh
cine wage workers

More Telugu News