'ఆర్ ఆర్ ఆర్' పనులతో బిజీ బిజీగా రాజమౌళి

06-04-2020 Mon 12:31
  • 75 శాతం షూటింగ్ పూర్తి 
  •  మే 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్ డే 
  • ఎడిటింగ్, గ్రాఫిక్స్ పనుల్లో రాజమౌళి
Rajamouli busy with RRR Movie

అటు ఎన్టీఆర్ అభిమానులు .. ఇటు చరణ్ ఫ్యాన్స్ 'రౌద్రం రణం రుధిరం' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగు వాయిదా పడింది. అయితే ఈ లాక్ డౌన్ లో రాజమౌళి విశ్రాంతి తీసుకోవడం లేదట. తన సినిమాకి సంబంధించిన పనులతో బిజీగానే ఉన్నాడని అంటున్నారు.

ఇంతవరకూ షూట్ చేసిన దానిని దగ్గరుండి ఎడిట్ చేయిస్తున్నాడట. అలాగే గ్రాఫిక్స్ కి సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ .. తెలుసుకుంటూ వెళుతున్నాడని అంటున్నారు. ఇక వచ్చేనెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు .. అందువలన ఆ సందర్భంగా వదలనున్న స్పెషల్ వీడియోపై ప్రత్యేక శ్రద్ధ త్తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇలా 'ఆర్ ఆర్ ఆర్'  పనులతో రాజమౌళి బిజీబిజీగానే వున్నాడని అంటున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ పూణేలో జరగనుంది.