నాదెండ్ల మనోహర్ కి విషెస్ చెప్పిన పవన్ కల్యాణ్

06-04-2020 Mon 12:28
  • నేడు నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు
  • మనోహర్ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్
  • రాష్ట్ర భవిష్యత్తుకి, ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్
Pawan Kalyans birthday greetings to Nadendla Manohar

జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారికి... జనసైనికుల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ సుదీర్ఘ రాజకీయ అనుభవం రాష్ట్ర భవిష్యత్తుకి, ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నా' అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై జనసేన వర్గీయులు తమ స్పందనను తెలియజేస్తున్నారు. పార్టీ ఓటమి తర్వాత అండగా ఉంటారని అనుకున్న వారంతా వదిలేసి వెళ్లిపోయారని... క్లిష్ట సమయంలో కూడా పవన్ కల్యాణ్ గారికి అండగా ఉన్నందుకు ధన్వవాదాలు అని వ్యాఖ్యానిస్తున్నారు.