కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచం మోదీ వైపు ఆశగా చూస్తోంది: జేపీ నడ్డా

06-04-2020 Mon 12:24
  • మోదీ తీసుకుంటున్న చర్యల తీరును ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు
  • బీజేపీ కార్యకర్తలు ఒక్కపూట భోజనం మానేయాలి
  • ప్రతి బీజేపీ కార్యకర్త 40 మందిని కలవాలి
  • కనీసం రూ.100ను పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని కోరాలి 
Whole world is looking towards PM Modi with hope to recover from this crisis Jagat Prakash Nadda BJP National President

ప్రధాని మోదీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసల జల్లు కురిపించారు. 'కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో భారత్‌లో ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్న తీరును ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేస్తారని ప్రపంచం మొత్తం మోదీ వైపు ఆశగా చూస్తోంది' అని చెప్పుకొచ్చారు.

బీజేపీ కార్యకర్తలందరూ ఒక్క పూట భోజనం మానేసి  కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పోరాడుతున్న వారికి సంఘీభావం తెలపాలని నడ్డా కోరారు. 'బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త 40 మందిని కలిసి కనీసం రూ.100ను పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని కోరాలి. ప్రజల కోసం పనిచేస్తోన్న పోలీసులు, వైద్యులు, నర్సులు, బ్యాంకు అధికారులు, పోస్ట్‌మెన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం' అని చెప్పారు.