కువైట్ లో భారతీయులపై కరోనా పంజా!

06-04-2020 Mon 11:31
  • గత 24 గంటల్లో 77 కొత్త కేసుల నమోదు
  • వీరిలో 74 మంది భారతీయులే
  • ఇప్పటి వరకు 559 కరోనా కేసుల నమోదు
Most of Kuwait corona cases are indians

గల్ఫ్ దేశం కువైట్ లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 77 కేసులు నమోదయ్యాయి. ఈ 77 మందిలో 58 మంది భారతీయులే కావడం గమనార్హం. ఈ విషయాన్ని అక్కడి ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ వెల్లడించారు. 77 మందిలో 74 మందికి కరోనా పాజిటివ్ వారిలో వారికే సోకిందని చెప్పారు. మిగిలిన ముగ్గురిలో ఒక వ్యక్తి ఫ్రాన్స్ కు వెళ్లిన కారణంగా మహమ్మారి బారిన పడ్డారని... మిగిలిన ఇద్దరికి వైరస్ ఎలా సోకిందో తెలియదని తెలిపారు.

కువైట్ లో ఇప్పటి వరకు 556 కరోనా కేసులు నమోదయ్యాయి. 456 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 17 మంది ఐసీయూలో ఉన్నారు. 99 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకినవారిలో భారతీయులతో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇరాన్ కు చెందిన వారు ఉన్నారు. మరోవైపు గత శనివారం కువైట్ లో తొలి కరోనా మరణం సంభవించింది. మృతుడు భారతీయుడే కావడం గమనార్హం.