ఈ వీడియో చూసి ఏడ్చాను!: హీరోయిన్‌ రష్మిక

06-04-2020 Mon 11:19
  • నిన్న రష్మిక పుట్టినరోజు
  • ఆమె జీవితం స్ఫూర్తిదాయకమంటూ నెటిజన్ వీడియో
  • భావోద్వేగానికి గురి చేశావన్న హీరోయిన్‌
rashmika breaks down

తన గురించి తీసిన ఓ వీడియోను చూసి కన్నీరు పెట్టుకున్నానని హీరోయిన్ రష్మిక తెలిపింది. నిన్న తన 24వ పుట్టినరోజు సందర్భంగా అభిమాని ఒకరు ఓ వీడియో రూపొందించి, ఆమె జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడింది.

దీనిపై రష్మిక సందిస్తూ... భావోద్వేగానికి గురి చేశావని, తన కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ట్వీట్ చేసింది. ఈ వీడియోను బాగా ఎడిట్‌ చేశావని పేర్కొంటూ, ఆ నెటిజన్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఆ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

 కాగా, మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన రష్మిక.. 'ఛలో', 'గీతగోవిందం', 'డియర్‌ కామ్రేడ్‌', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' సినిమాలతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.