కర్ణాటకలో సీనియర్‌ బీజేపీ నాయకుడు కోటిరెడ్డి మృతి

06-04-2020 Mon 11:00
  • అనారోగ్యంతో కన్నుమూత
  • నివాళులర్పించిన పార్టీ నాయకులు
  • పార్టీ గెలుపునకు ఆయన సేవలు మరువలేనివని కితాబు
karnataka bjp senior leader kotireddy passes away

కర్ణాటక రాష్ట్ర బీజేపీలో సీనియర్‌ నాయకుడు కోటిరెడ్డి (65) అనారోగ్యంతో కన్నుమూశారు. పార్టీలో కీలక  గుర్తింపు ఉన్న కోటిరెడ్డి ఆ రాష్ట్రంలో పార్టీ గెలుపునకు తనవంతు కృషి చేశారు. ఆయన మరణ వార్త తెలిసి చుట్టుపక్కల గ్రామాల నుంచి నాయకులు తరలి వచ్చి నివాళులర్పించారు. ఎమ్మెల్యే జె.ఎన్‌.గణేషన్‌, మాజీ ఎమ్మెల్యే సురేష్‌బాబులు కూడా కోటిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటిరెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.