మలయాళ హిట్ మూవీ రీమేక్ లో రానా ఖరారైనట్టే!

06-04-2020 Mon 10:37
  • మలయాళంలో హిట్ కొట్టిన మూవీ 
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు 
  • ఒక కథానాయకుడిగా బాలకృష్ణ  
Ayyappanum Koshiyum Movie

మలయాళంలో ఈ మధ్యకాలంలో విజయవంతమైన చిత్రాలలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఒకటి. సచే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ .. బిజూ మీనన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇద్దరు వ్యక్తుల ఇగో సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంది.

ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను నాగవంశీ దక్కించుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర కోసం బాలకృష్ణను ఒప్పించినట్టుగా వార్తలు వచ్చాయి. బిజూ మీనన్ పాత్ర కోసం రానాను సంప్రదిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ పాత్రకి రానా ఎంపిక ఖరారైపోయిందనేది తాజా సమాచారం. బాలకృష్ణ - రానా మధ్య గల సాన్నిహిత్యం కారణంగానే ఈ కాంబినేషన్ సెట్ అయిందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి వుంది.