వెలవెలబోయిన వాటికన్... ఏకాంతంగా దివ్యబలి పూజ!

06-04-2020 Mon 07:53
  • గుడ్ ఫ్రైడ్ ముందు ఆదివారం నాడు ప్రత్యేక ప్రార్థనలు
  • పామ్ ప్రార్థనలకు హాజరు కాని ప్రజలు
  • ఇప్పటికే వాటికన్ సిటీ మూసివేత
No People in Vatican
కరోనా మహమ్మారి ప్రభావం క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గుడ్ ఫ్రైడేపైనా పడింది. గుడ్‌ ఫ్రైడేకు ముందు వచ్చే ఆదివారం జరిపే సంప్రదాయ పామ్ (మ్రానికొమ్మల) ప్రార్థనలకు ప్రజలు లేక వాటికన్ వెలవెలబోయింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ సంవత్సరం వాటికన్‌ సిటీని మూసివేయగా, పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రత్యేక దివ్యబలి పూజను సెయింట్‌ పీటర్స్‌ బసిలికా లోపలే ఏకాంతంగా నిర్వహించగా, అతి తక్కువ మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోప్‌ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి మానవ ఆశలపై నీళ్లు చల్లిందని, ప్రజల హృదయాలపై మోయరాని భారాన్ని మోపిందని అన్నారు. దేవుని దయతో త్వరలోనే పరిస్థితి సద్దుమణుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.