సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

06-04-2020 Mon 07:42
  • పూజ హెగ్డే కిచెన్ ప్రావీణ్యం 
  • గోపీచంద్ మరో యాక్షన్ సినిమా 
  • హిందీలోకి బన్నీ హిట్ చిత్రం 
Pooja Hegde exhibits her skills in kichen

 *  ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా గడుపుతున్నారు. ముంబైలో వుంటున్న అందాలతార పూజ హెగ్డే కిచెన్ లో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తోంది. కుటుంబ సభ్యులకు ప్రతి రోజూ రకరకాల వంటలు వండి పెట్టి కాంప్లిమెంట్స్ పొందుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
*  ప్రస్తుతం 'సీటీ మార్' చిత్రంలో నటిస్తున్న యాక్షన్ హీరో గోపీచంద్ దీని తర్వాత తేజ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ చిత్రంగా రూపొందిస్తారు. నవంబర్ నుంచి దీని షూటింగ్ జరుగుతుంది.
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం సూపర్ హిట్టయిన నేపథ్యంలో దీనిని హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని 'కబీర్ సింగ్'గా రీమేక్ చేసి విజయం సాధించిన బాలీవుడ్ నిర్మాత అశ్విన్ వర్దే భారీ ఆఫర్ ఇచ్చి ఈ హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం.