తెలంగాణాలో కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు 

06-04-2020 Mon 07:18
  • ప్రస్తుతం తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 333
  • ఇప్పటివరకు 11 మంది మృతి
  • డిశ్చార్జి అయిన వారి సంఖ్య 33
New Corona positive cases rised to 62

తెలంగాణాలో కొత్తగా ఈ రోజు 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 333కు చేరుకుంది. కాగా కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 11 మంది మృతి చెందారు.  ఇప్పటి వరకు వివిధ ఆస్పత్రుల్లో కోలుకుని 33 మంది డిశ్చార్జి అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 289 మంది చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.