దీపాలను వెలిగించి సంఘీభావం తెలుపుతూ.. ఏపీ సీఎం జగన్.. వీడియో ఇదిగో!

05-04-2020 Sun 22:09
  • మోదీ పిలుపు మేరకు కొవ్వొత్తులను వెలిగించిన దేశ ప్రజలు
  • తాడేపల్లిలోని నివాసంలో కొవ్వొత్తి వెలిగించిన జగన్
  • పక్కనే సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు
Jagan lit candle at his residence

కరోనాపై పోరాటంలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొవ్వొత్తి వెలిగించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసంలో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అందరూ కొవ్వొత్తులను చేతపట్టి, కరోనాపై పోరాటానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. మరోవైపు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాదులోని తన నివాసంలో కుమారుడు నారా లోకేశ్, మనవడు దేేవాన్ష్ లతో కలిసిన ఈ కార్యక్రమంలో పలుపంచుకున్నారు.