తన నివాసంలో జ్యోతిని ప్రజ్వలింపచేసిన ప్రధాని మోదీ

05-04-2020 Sun 21:51
  • దీప యజ్ఞానికి పిలుపునిచ్చిన ప్రధాని
  • తన నివాసంలో రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పిన వైనం
  • యావత్ భారతం ప్రధాని పిలుపుకు స్పందన
PM Modi enlighten as nation followed his call

విశాల భారతదేశం నుంచి కరోనా మహమ్మారి చీకట్లను తరిమికొట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ దీప యజ్ఞానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపుమేరకు యావత్ భారతం ఆదివారం రాత్రి 9 గంటలకు తమ నివాసాల్లో లైట్లు ఆర్పివేసి 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి దేశ ఐక్యతను ఘనంగా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ సైతం తన నివాసంలో లైట్లు ఆర్పివేసి జ్యోతిని ప్రజ్వలింపచేశారు. అటు, అనేకమంది ప్రముఖులు కూడా దీపాలు వెలిగించి, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.