మోదీ పిలుపు మేరకు సంఘీభావ శక్తిని చాటిన 130 కోట్ల మంది ప్రజలు

05-04-2020 Sun 21:49
  • 9 నిమిషాల పాటు లైట్లను ఆపివేసిన ప్రజలు
  • జ్యోతులను వెలిగించి సంఘీభావం ప్రకటించిన వైనం
  • క్యాండిల్స్ వెలిగించిన చంద్రబాబు, కేసీఆర్, జగన్
India Lights Lamps To Show Unity In Fight Against Corona virus

కరోనా రక్కసిని కలసికట్టుగా ఎదుర్కొందామన్న ప్రధాని మోదీ... దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఈ రాత్రి 9 గంటలకు 9 తొమ్మిది నిమిషాల పాటు ఇంట్లో లైట్లను ఆఫ్ చేసి, దీపాలను వెలిగించి సంఘీభావాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు సరిగ్గా 9 గంటలకు ప్రజలంతా లైట్లను ఆపి, బాల్కనీలు, ఇంటి వెలుపలకు వచ్చి దీపాలను వెలిగించారు.

గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని... కరోనాపై యుద్ధంలో తమ స్ఫూర్తిని చాటి చెప్పారు. 130 కోట్ల మంది తమ శక్తిని చాటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అధికారులు, మంత్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తమ నివాసాల వద్ద జ్యోతులు వెలిగించారు.