ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252.. కర్నూలు జిల్లాను వణికిస్తున్న మహమ్మారి

05-04-2020 Sun 20:02
  • ఈరోజు కొత్తగా 26 కొత్త పాజిటివ్ కేసుల నమోదు
  • అన్ని కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదైన వైనం
  • 34 కేసులతో రెండో స్థానంలో నెల్లూరు జిల్లా
Total corona positive cases in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొత్తగా 26 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కొత్త కేసులన్నీ కర్నూలు జిల్లాలోనే  నమోదు కావడం గమనార్హం. కొత్త కేసులతో కర్నూలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 53కి పెరిగింది. దీంతో కర్నూలు జిల్లా వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. 34 కేసులతో నెల్లూరు, 30 కేసులతో గుంటూరు జిల్లా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు.