కర్నూలు సహా ఆ జిల్లాలో కంటైన్ మెంట్ జోన్లు ప్రకటించిన ప్రభుత్వం

05-04-2020 Sun 20:04
  • ఏపీలో క్రమక్రమంగా పెరుగుతున్న ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 
  • కర్నూలులో ఇవాళ ఒక్కరోజే 26 కేసుల నమోదు
  • ఈ నేపథ్యంలో పటిష్ఠమైన చర్యలు చేపట్టిన జిల్లా యంత్రాంగం
Kurnul and other cities in this district are declared as containment Zones

ఏపీలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఇవాళ ఒక్క రోజే 26 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన జిల్లాలోని పలు పట్టణాలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించింది. కర్నూలు తో పాటు నంద్యాల, కోడుమూరు, నందికొట్కూరు, బనగానపల్లె, ఆత్మకూరు, గడివేముల, పాణ్యం, అవుకు పట్ణణాలను ఈ జోన్ల కింద ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ప్రకటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నిత్యావసరవస్తువుల విక్రయాలు సైతం నిలిపివేయనున్నారు.