కరోనా ఎఫెక్ట్: తూర్పు గోదావరి జిల్లాలో 150 మందితో ప్రార్థనలు చేయించిన పాస్టర్ అరెస్ట్

05-04-2020 Sun 19:43
  • దేశంలో లాక్ డౌన్
  • ఎవరూ గుమికూడవద్దని ప్రభుత్వం హెచ్చరిక
  • ఆదివారం చర్చిలో ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్
Police arrests pastor after conducted prayers with huge gathering in a church

కరోనా వైరస్ వ్యాప్తికి ప్రజాసమూహాలే కారణమవుతాయని, ఎవరూ గుమికూడవద్దని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. ఇవన్నీ పెడచెవిన పెట్టిన ఓ పాస్టర్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ పాస్టర్ లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి 150 మందితో ప్రార్థనలు చేయించడం కలకలం రేపింది. ఆదివారం సందర్భంగా చర్చిలో ప్రార్థనలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో విశ్వాసులు హాజరయ్యారు. దాంతో పోలీసులు ఆ చర్చి పాస్టర్ ను అరెస్ట్ చేశారు.