క్వారంటైన్ సెంటర్ విషయంలో గొడవ.. ఒకరు మృతి

05-04-2020 Sun 19:36
  • పశ్చిమబెంగాల్ లో ఘటన
  • క్వారంటైన్ ఏర్పాటును వ్యతిరేకించిన ఓ వర్గం
  • కత్తులు, బాంబులతో దాడి
One person dead in attacks over quaratine centre establishment

కరోనా మహమ్మారి బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చమబెంగాల్ లోని బిర్బ్ హమ్ జిల్లా పరుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిబ్ పూర్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్లే, గ్రామంలోని పాఠశాలలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. అయితే గ్రామంలోని ఓ వర్గానికి చెందిన ప్రజలు దీన్ని వ్యతిరేకించగా... మరో వర్గం సమర్థించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరగింది. ఇది ముదిరి... కత్తులు, బాంబులతో ఒకరిపై మరొకరు దాడికి తెగబడేంత వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురికి గాయాలయ్యాయి.

గొడవ గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.