ఇంటి ఎదుట గట్టిగా మాట్లాడుతున్నారని ఐదుగురి కాల్చివేత

05-04-2020 Sun 19:28
  • రష్యాలోని ఓ గ్రామంలో దారుణం
  • మొదట వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి
  • లెక్కచేయకపోవడంతో తుపాకీతో కాల్పులు జరిపిన వైనం
Man has shot dead five members in Russia

రష్యాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన ఇంటి ముందు గట్టిగా మాట్లాడుతున్నారంటూ ఓ వ్యక్తి ఐదుగుర్ని తుపాకీతో కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మాస్కో నగరానికి ఆగ్నేయంగా రైజాన్ ప్రాంతంలోని యెలాట్మా అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఓ వ్యక్తి తన ఇంటిముందు కొందరు గుమికూడి పెద్దగా అరుచుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. బాల్కనీలోకి వచ్చి వారందనీ గట్టిగా మాట్లాడొద్దంటూ ఓసారి హెచ్చరించాడు. అయినప్పటికీ వారు వినకపోవడంతో తన తుపాకీతో పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.