రోజు కూలీ సినీ కార్మికులకు అండగా ఉంటానన్న తన కోడలిపై చిరంజీవి ప్రశంసలు!

05-04-2020 Sun 18:16
  • సీసీసీ ధ్రువీకరించిన రోజు వారీ సినీ కార్మికులకు ఉచితంగా మందులు
  • అన్ని అపోలో మందుల స్టోర్స్ నుంచి పొందవచ్చు
  • పెద్ద మనసు చాటుకున్న ఉపాసన అంటూ చిరంజీవి ప్రశంస
Hero Chiranjeevi praises Daughter in law Upasana

లాక్ డౌన్ ప్రభావంతో రోజు వారి సినీ కార్మికులు ఇబ్బంది పడకుండా ఉండే నిమిత్తం ప్రముఖ హీరో చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీసీసీ కి ఇప్పటికే పలువురు హీరోలు తమ విరాళాలు ప్రకటించారు. రోజు కూలీ సినీ కార్మికులకు అండగా నిలవాలన్న తలంపుతో చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన ముందుకొచ్చారు.

ఈ సందర్భంగా తన కోడలినిప్రశంసిస్తూ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. సీసీసీ తో ధ్రువీకరించబడిన రోజు వారి సినీ కార్మికులందరికీ ఉచితంగా మందులు అందజేయాలన్న ఆలోచనతో ముందుకొచ్చిన తన కోడలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. రోజువారీ సినీ కార్మికులు అన్ని అపోలో ఫార్మసీ స్టోర్ల ద్వారా ఈ మందులు పొందవచ్చని అన్నారు.