తాత గారితో చిన్నప్పటి గల్లా జయదేవ్ ఎలా ఉన్నాడో చూడండి!

05-04-2020 Sun 17:58
  • తాతయ్యతో తాను కలిసివున్న ఫొటో షేర్ చేసిన జయదేవ్
  • ఆయనే తన మార్గదర్శి అంటూ ట్వీట్
  • శతజయంతి సందర్భంగా నివాళులు 
Galla Jaydev shares rare photo of his grandfather

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ లో అరుదైన ఫొటో షేర్ చేశారు. తన తాతగారైన పాటూరి రాజగోపాలనాయుడుతో తాను కలిసి ఉన్నప్పటి ఫొటో అది. అందులో చిన్నారి గల్లా జయదేవ్ తన తాతతో సరదాగా మాట్లాడుతున్నప్పటి దృశ్యం బ్లాక్ అండ్ వైట్ లో చూడొచ్చు.

దీనిపై గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. "ఇవాళ మేం మా తాతగారైన రాజగోపాలనాయుడు శతజయంతి వేడుక జరుపుకుంటున్నాం. ఆయనకు అత్యంత గౌరవభావంతో నివాళులు అర్పిస్తున్నాను. నా ఎదుగుదలకు ఆయన నేర్పిన జీవితపాఠాలే సోపానాలు అయ్యాయి. నా మార్గదర్శిగా నిలిచినందుకు థాంక్యూ తాతయ్యా!" అంటూ స్పందించారు.