దేశంలో ‘కరోనా’ మృతుల సంఖ్య 79 కి చేరింది: లవ్ అగర్వాల్

05-04-2020 Sun 17:44
  • దేశ వ్యాప్తంగా 274 జిల్లాల్లో ‘కరోనా’ ప్రభావం ఉంది
  • ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 3374 కు చేరింది
  • గత ఇరవై నాలుగు గంటల్లో 11 మంది మృతి చెందారు
Love Agarwarl says corono virus cases increased

మన దేశంలో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 79కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా 274 జిల్లాల్లో ‘కరోనా’ ప్రభావం ఉందని అన్నారు.

నిన్నటి నుంచి కొత్తగా 472 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 3374 కు చేరిందని చెప్పారు.  గత ఇరవై నాలుగు గంటల్లో 11 మంది మృతి చెందగా, 267 మంది కోలుకున్నారని వివరించారు. ‘కరోనా’ కట్టడికి ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా పాటించాలని మరోమారు సూచించారు.

అనంతరం కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్యా సలిలా శ్రీ వాత్సవ్ మాట్లాడుతూ, లాక్ డౌన్ ఆంక్షలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయని, నిత్యావసరాల సరఫరా అమలు తీరు కూడా బాగుందని ప్రశంసించారు.