ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు రాసుకుని దీపాలు వెలిగించొద్దని ప్రభుత్వ సూచన

05-04-2020 Sun 17:18
  • ఈరోజు రాత్రి దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు
  • దీపాలు వెలిగించేముందు పౌరులకు జాగ్రత్తలు చెప్పిన  ప్రభుత్వం
  • ఆల్కహాల్ కు మండే స్వభావం ఉంటుంది కనుక వాడొద్దని సూచన
Central Government suggestion to citizens

కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా చేస్తున్న పోరాటం యావత్తు దేశం కలిసికట్టుగా ఉందని చెప్పేందుకు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది.

ప్రమిదలలో దీపాలు వెలిగించే ముందు, లేదా కొవ్వొత్తులు వెలిగించేముందు పౌరులు తమ చేతులను సబ్బుతో  మాత్రమే శుభ్రంగా కడుక్కోవాలని, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లతో వద్దని హెచ్చరించింది. ఆల్కహాల్ కు మండే స్వభావం ఉన్న కారణంగా దీంతో తయారు చేసిన శానిటైజర్లను వాడకూడదని పేర్కొంది.

కాగా, ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది నిమిషాల పాటు ప్రజలు తమ ఇళ్లల్లో విద్యుత్ లైట్లు ఆర్పేసి దీపాలు లేదా క్యాండిల్స్, సెల్ ఫోన్ లైట్స్, టార్చిటైట్లు వెలిగించాలన్న మోదీ పిలుపును పాటించేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.