‘9 బజే 9 మినిట్’ అంటూ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుత వీడియో పోస్ట్

05-04-2020 Sun 16:52
  • ‘కొవిడ్-19’పై పోరాటానికి సుదర్శన్ పట్నాయక్ పిలుపు
  •  ‘9 బజే 9 మినిట్స్’ కు యావత్తు దేశం ఒకే తాటిపై నిలబడనుంది
  • శాండ్ ఆర్ట్ వీడియోను పోస్ట్ చేసిన సుదర్శన్ పట్నాయక్
Sand Artist Sudarshan Patnaik posted a video

ఏ అంశంపైనా అయినా సరే ప్రజలను తన దైన శాండ్ ఆర్ట్ ద్వారా చైతన్య పరిచే ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. ‘కొవిడ్-19’పై పోరాటం నిమిత్తం యావత్తు జాతి ఒకే తాటిపై నిలిచిందనడానికి గుర్తుగా ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ప్రతి ఒక్కరు దీపం వెలిగించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆయన స్పందించారు. తాను రూపొందించిన శాండ్ ఆర్ట్ లో దీపాలను వెలిగించిన సుదర్శన్ పట్నాయక్,  ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు యావత్తు దేశం ఒకే తాటిపై నిలబడనుందని పేర్కొంటూ ఓ పోస్ట్ చేశారు. ‘కోవిడ్-19’ పై పోరాటానికి శాండ్ ఆర్ట్ వీడియోను పోస్ట్ చేశారు.