రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ కు కన్నా లేఖ

05-04-2020 Sun 14:48
  • ఏపీలో రూ.1000 చొప్పున పంపిణీ
  • ఆర్థికసాయాన్ని వైసీపీ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారన్న కన్నా
  • వారిపై అనర్హత వేటు వేయాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి
BJP leader Kanna writes to SEC Ramesh Kumar

కరోనా లాక్ డౌన్ కారణంగా ఏపీలో 1000 రూపాయల చొప్పున పంపిణీ చేసిన సంగతి తెలసిందే. దీనిపై ఏపీ బీజేపీ అగ్రనేత కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు లేఖ రాశారు. పేదలకు ప్రకటించిన వెయ్యి రూపాయల ఆర్థికసాయాన్ని వైసీపీ అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారని తన లేఖలో ఆరోపించారు. ఆ డబ్బును వైసీపీ పంపిణీ చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ అభ్యర్థులపై అనర్హత వేటు వేసి జైలు శిక్ష విధించాలని కోరారు. ఇలాంటి సంక్షోభ సమయంలో స్వార్థ రాజకీయాలు తగవని వైసీపీకి హితవు పలికారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.