‘కరోనా’ని జగన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొందో చూడండంటూ నారా లోకేశ్ ఓ వీడియో పోస్ట్

05-04-2020 Sun 13:58
  • ‘కరోనా’ కు అంతగా భయపడాల్సిన పని లేదంటారా!
  • ఏపీలో ’కరోనా’  పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి
  • ‘ప్యానిక్ బటన్’ నొక్కాల్సిన అవసరం లేదంటారన్న జగన్ పై విమర్శలు
Nara Lokesh criticises CM Jagan

కరోనా వైరస్ కు అంతగా భయపడాల్సిన పని లేదన్న సీఎం జగన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ను జత చేస్తూ జగన్ పై విమర్శలు చేశారు. ఏపీలో ‘కరోనా’ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ‘ఇప్పటి వరకు, ‘కరోనా’ని జగన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొందో చూడండి’ అంటూ ఓ వీడియోను జత చేశారు. ‘కరోనా’ ఏదో భయానక వైరస్ అని చెబుతున్నారని, ‘ప్యానిక్ బటన్’ నొక్కాల్సిన అవసరం లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేశ్ విమర్శలు చేశారు.