గళ్ళ గురిగిలో దాచుకున్న చిల్లర డబ్బులను ప్రభుత్వానికి ఇచ్చిన చిన్నారి.. కేటీఆర్‌ ప్రశంసల జల్లు

05-04-2020 Sun 14:00
  • కేటీఆర్‌కు ఆ పాప తండ్రి ట్వీట్ 
  • 'మీరంటే ఒక అభిమానం' అని వ్యాఖ్య
  • రూ.440 విరాళం ఇచ్చిన పాప
Thanks Advitha ktr

తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అప్పుడప్పుడు ఇవ్వగా దాచుకున్న చిల్లర డబ్బులను గళ్ళ గురిగిలో దాచుకున్న ఓ పాప కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ డబ్బులను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను గాంధీ మిరియాల అనే వ్యక్తి సామాజిక మాధ్యమంలో తెలిపారు.

'కేటీఆర్‌ అన్నయ్య.. టీవీ, సోషల్ మీడియాల్లో అందరూ విరాళాలు ఇస్తుండడం చూసి నా కూతురు అద్విత కూడా తన సేవింగ్ గళ్ల గురిగి పగలకొట్టి మరీ డొనేట్ చేసింది... మీరంటే ఒక అభిమానం' అంటూ ఒకరు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఆ పాప తెలంగాణ ప్రభుత్వానికి రూ.440 విరాళం ఇచ్చిన విషయానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేశారు.

దీనిపై స్పందించిన కేటీఆర్‌ థ్యాంక్స్‌ అద్విత అని ఆ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసి ఆమె ఫొటోను పోస్ట్ చేశారు. ఆ పాపపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.