సంక్షోభ సమయంలో వైసీపీవీ స్వార్థ రాజకీయాలు: బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

05-04-2020 Sun 12:53
  • ఈ మేరకు ట్విటర్‌లో వీడియో పోస్టు
  • పేదలకు అందిస్తున్న రూ.వెయ్యి కేంద్ర నిధులు
  • తనే ఇస్తున్నట్లు చెప్పుకుంటున్న అధికార పార్టీ
The funds are cntral aid says kanna

కరోనా తీవ్రత వంటి సంక్షోభ సమయంలో ఏపీలోని అధికార పార్టీ స్వార్థ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి సాయం అందజేస్తుంటే అదేదో తామే అందజేస్తున్నట్లు అధికార పార్టీ వైసీపీ కలర్ ఇవ్వడం తగదని ధ్వజమెత్తారు.

రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేంద్రం అందించే సాయానికి వైసీపీ స్టిక్కర్లు వేస్తారా? అని ప్రశ్నించారు. చాలా చోట్ల డబ్బు అందించేందుకు వలంటీర్లతో కలిసి వైసీపీ నాయకులు తిరుగుతూ ఓట్ల వేట చేయడాన్ని తప్పుపట్టారు. ఈ విషయాన్ని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.