చైనాలో కరోనా విజృంభణ... మరోసారి కలకలం

05-04-2020 Sun 12:39
  • కొత్తగా మరో 30 మందికి పాజిటివ్
  • వారిలో 25 మంది విదేశాల నుంచి వచ్చిన వారే
  • ఇటీవలే నిబంధనలు సడలించిన ప్రభుత్వం
china corona cases

కరోనా వైరస్‌ పుట్టిన చైనాలో మొత్తం 3,300 మందికి పైగా ఆ వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వైరస్‌ విజృంభణను అరికట్టడంతో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారు. అయితే, మరోసారి చైనాలో ఆ వైరస్‌ బాధితులు క్రమంగా  పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. చైనాలోని దక్షిణ ప్రాంతంలో కొత్తగా 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అక్కడి  అధికారులు తెలిపారు. నిన్న ఈ 30 కేసులు నమోదుకాగా వారిలో 25 మంది విదేశాల నుంచి వచ్చినవారని చెప్పారు. అంతేకాదు, కరోనా లక్షణాలతో బాధపడుతున్న మరో 62 మందిని అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు చైనాలో 81,669 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.