Lockdown: లాక్‌డౌన్‌ మరో 9 రోజులు మాత్రమే: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతం సవాంగ్

lockdown in ap
  • అప్పటి వరకు ప్రజలు నిబంధనలు పాటించాలి
  • ఇదే స్ఫూర్తితో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
  • పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారు

లాక్‌డౌన్‌ నిబంధనలు మరో తొమ్మిది రోజులు మాత్రమే ఉంటాయని, అప్పటి వరకు ప్రజలు నిబంధనలు పాటించాలని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతం సవాంగ్ కోరారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. కరోనాను నిరోధించేందుకు పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని, వారి సేవలను ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... గుంటూరు, విజయవాడ పోలీసులు మరింత కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. కాగా, గుంటూరులో 30 మంది కరోనా బాధితులు ఉండగా, కృష్ణా జిల్లాలో 28 మందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 

  • Loading...

More Telugu News