Ranga Reddy District: ఒకే గ్రామానికి చెందిన 800 మంది కార్మికులకు క్వారంటైన్!

  • గ్రామానికి చెందిన మహిళ కరోనాతో మృతి
  • దీంతో ఆమె పనిచేసిన చోట కార్మికులందరికీ పరీక్షలు 
  • గ్రామంలోకి రాకపోకలు నిషేధం

వందలాది మంది కార్మికులు పనిచేసే చోట ఓ మహిళ కరోనాతో మృతి చెందడంతో ముందు జాగ్రత్తగా మొత్తం 800 మంది కార్మికులను అధికారులు క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. వివరాల్లోకి వెళితే...రంగారెడ్డి జిల్లా చేగూరు గ్రామ పరిధిలోని కన్హా శాంతివనంకు చెందిన ఓ మహిళ కరోనా వైరస్ కారణంగా చనిపోయింది. అప్పటికి ఈ వనంలో 800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 

దీంతో నిన్న శాంతివనంను సందర్శించిన కలెక్టర్ అక్కడి పరిస్థితిని గమనించారు. మొత్తం అక్కడ పనిచేస్తున్న కార్మికులందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. అలాగే కలెక్టర్ ఆదేశాల మేరకు చేగూరు గ్రామ సరిహద్దులో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. గ్రామంలో ఇంకెవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా అని తనిఖీలు నిర్వహిస్తున్నారు.

More Telugu News