పోలీసు సేవలకు గౌరవం.. పూలవర్షం కురిపించిన మీరట్ వాసులు

05-04-2020 Sun 10:12
  • రోడ్డుకు ఇరువైపులా నిల్చుని వాహనాలపై పూలవర్షం
  • వారి సేవలు అనిర్వచనీయమని ప్రశంసలు
  • వైరల్ అవుతున్న వీడియో
People shower flowers at police vehicles in Meerut

లాక్‌డౌన్ నేపథ్యంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లపైకి వచ్చి సేవలు అందిస్తున్న పోలీసులను మీరట్ వాసులు గొప్పగా సత్కరించారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని పోలీసు వాహనాలపై పూలవర్షం కురిపించి తమ గౌరవాన్ని చాటుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ దేశంలో అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని ఈ సందర్భంగా మీరట్ వాసులు కొనియాడారు. కుటుంబాలను వదిలిపెట్టి, తమ ప్రాణాలను పణంగా పెట్టి సమాజానికి వారు సేవ చేస్తున్నారని ప్రశంసించారు.