Nellore District: నెల్లూరు యువకుడికి ఉదయం కరోనా పాజిటివ్, సాయంత్రం నెగటివ్... జరిగిందిదే!

Nellore Person Corona Report Changed
  • యువకుడిలో కనిపించిన కరోనా లక్షణాలు
  • సాంకేతిక సమస్యతో తప్పుడు రిపోర్టు
  • నెగటివ్ వచ్చిందని నిర్దారించిన వైద్యులు
నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడిలో కరోనా లక్షణాలు కనిపించగా, ఈ నెల 3వ తేదీ ఉదయం జరిగిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఆపై సాయంత్రం వచ్చిన మరో రిపోర్టులో అతనికి వైరస్ సోకలేదని తేలింది. ఇందుకు సంబంధించిన రెండు రిపోర్టులూ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలే తీవ్ర భయాందోళనల్లో ఉన్న ప్రజలు, ఈ తరహా ఘటనలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

జరిగిన ఘటన, రిపోర్టులు మారడంపై నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి అదనపు ఆర్ఎంఓ డాక్టర్ కనకాద్రి స్పందించారు. ఆ యువకుడికి కరోనా సోకలేదని తేల్చారు. సాంకేతిక సమస్య కారణంగా తొలుత వచ్చిన రిపోర్టు పాజిటివ్ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఆపై తప్పు సరిచేసుకుని, దాన్ని నెగటివ్ గా నిర్దారించి, రిపోర్టును ఆసుపత్రికి పంపించారని తెలియజేశారు.
Nellore District
Corona Virus
Positive
Negative

More Telugu News