ఎస్కార్ట్ కానిస్టేబుల్‌పై దాడిచేసి తుపాకితో పరారైన రిమాండ్ ఖైదీ

05-04-2020 Sun 07:29
  • నిజామాబాద్‌లో ఘటన
  • అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు
  • ఆసుపత్రిలో కానిస్టేబుల్‌పై దాడి చేసి పరార్
Remand prisoner attacked constable and ran away with gun

ఎస్కార్ట్ కానిస్టేబుల్‌పై దాడి చేసి తుపాకితో పరారయ్యాడో రిమాండ్ ఖైదీ. తెలంగాణలోని నిజమాబాద్ జిల్లాలో నిన్న రాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గౌతంనగర్‌కు చెందిన ప్రసాద్‌ను ఓ దొంగతనం కేసులో మాక్లూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు.

ఇటీవల అతడు అనారోగ్యం పాలవడంతో నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడికి కాపలాగా ఓ కానిస్టేబుల్‌ను పెట్టారు. నిన్న రాత్రి కానిస్టేబుల్‌పై దాడిచేసిన నిందితుడు ప్రసాద్ కానిస్టేబుల్ నుంచి తుపాకి లాక్కుని పరారయ్యాడు. విషయం తెలిసి అప్రమత్తమైన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.