గత రాత్రి ట్వీట్ పెట్టిన వైఎస్ జగన్... స్పందించిన నరేంద్ర మోదీ!

05-04-2020 Sun 06:29
  • నేటి రాత్రి దీపాలు వెలిగిద్దాం
  • అనంతమైన ప్రకాశంతో చీకటిని పారద్రోలుదామన్న జగన్
  • సమైక్యత పెంచే మాట చెప్పారన్న మోదీ
Modi Aplauds Jagan Tweet

నేటి రాత్రి దేశ ప్రజలంతా ఒకేసారి లైట్లను ఆర్పివేసి, దీపాలను కాసేపు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై వైఎస్ జగన్ ట్వీట్ చేయగా, ఆ వెంటనే ప్రధాని సైతం స్పందించారు. "రాత్రి 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్కరూ 9 నిమిషాల పాటు ఆశాజ్యోతులను వెలిగించండి. ఒక అనంతమైన ప్రకాశంతో కమ్ముకొచ్చిన చీకటిని పారద్రోలుదాము. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మనమంతా ఐక్యంగా ఉండి, కరోనా మహమ్మారిపై బలమైన శక్తిగా నిలుద్దాం" అని పిలుపునిచ్చారు.

ఆపై జగన్ చేసిన ట్వీట్ ను మోదీ ప్రస్తావిస్తూ, అభినందించారు. జగన్ కు ధన్యవాదాలు చెబుతూ, "ఈ క్లిష్ట సమయంలో మీ సహకారం ఎంతో విలువైనది. వైరస్ పై పోరాటంలో దేశ ప్రజల్లో సమైక్యతను నింపేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది" అని అన్నారు.