ఈమె పేరేంటో తెలియదు కానీ.. ఆమె సేవలు అద్భుతం: కేటీఆర్‌ ప్రశంసల జల్లు

04-04-2020 Sat 22:01
  • ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్‌ సేవలు
  • ఫొటో పోస్ట్ చేసిన కేటీఆర్
  • స్కూటీపై ఇంటింటికీ వెళ్తూ కోడిగుడ్లు అందిస్తోన్న టీచర్‌
  • పోషకాహార పథకం కింద గిరిజన ప్రాంతాల్లో గర్భిణులు, పిల్లలకు పంపిణీ  
ktr on anganwadi teacher

కరోనా విజృంభణ నేపథ్యంలో నిస్వార్థంగా సేవలు అందిస్తోన్న అంగన్‌వాడీ టీచర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఆమె సేవలు చేస్తోన్న ఫొటోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆమె పేరు ఏంటో తనకు తెలియదని, అయితే ఆమె సేవలు అద్భుతమని అన్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు సెక్టార్‌ పరిధిలోని చింతూరు గ్రామ అంగన్‌ వాడీ టీచర్‌ ఆమె.

ఆ టీచర్‌ తన స్కూటీపై ఇంటింటికీ వెళ్తూ కోడిగుడ్లు, బాలామృతాన్ని పోషకాహార పథకం కింద గిరిజన ప్రాంతాల్లో గర్భిణులు, పిల్లలకు అందజేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఐసీడీఎస్‌ అధికారులు ట్విట్టర్‌లో పోస్టు చేయగా వాటిని కేటీఆర్‌ చూశారు. ఈ వివరాలు తెలుపుతూ ఆమెను అభినందించారు. ఆమె పేరు రమణ అని తెలుస్తోంది.