లాక్ డౌన్ సమయంలో స్నేహితుడితో కలసి 'కెవ్వుకేక' హీరోయిన్ షికార్లు... రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

04-04-2020 Sat 21:51
  • బెంగళూరులో నటి షర్మిల మాండ్రే ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం
  • గాయాలపాలైన షర్మిల
  • వేకువజామున 3 గంటలకు ఘటన
Sharmila Mandre injured in a road accident

అల్లరి నరేశ్ సరసన 'కెవ్వుకేక' చిత్రంలో నటించిన కన్నడ భామ షర్మిలా మాండ్రే ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. షర్మిల తన స్నేహితుడు లోకేశ్ వసంత్ తో కలిసి ఓ కారులో ప్రయాణిస్తుండగా బెంగళూరు వసంత్ నగర్ లో ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు ఓ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దాంతో కారు ముందుభాగం ఓవైపు నుజ్జునుజ్జయింది.

లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ వేకువజామున 3 గంటల సమయంలో వారిద్దరూ కారులో ఎందుకు బయటికి వచ్చారన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీరిద్దరూ సరదాగానే కారులో షికారుకు వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై కేసు నమోదైంది. కాగా, గాయాలపాలైన షర్మిల, లోకేశ్ లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.