'మద్యం తాగి రచ్చ చేశారట కదా?' అని ప్రశ్నించిన నెటిజన్‌.. యాంకర్‌ అనసూయ సీరియస్‌!

04-04-2020 Sat 21:47
  • నిజాలు వేరే ఉంటాయి
  • పరిణతి చెందితే నీకు కూడా అర్థమవుతుంది 
  • నువ్వు ఇంకా పరిణతి చెందలేదు
anasuya fires on netizen

ఓ నెటిజన్‌పై యాంకర్‌ అనసూయ సీరియస్‌ అయింది. తాజాగా ఆమె ట్విట్టర్‌లో అభిమానులతో ఛాటింగ్‌ చేసి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తరుణ్‌ భాస్కర్‌తో కలిసి మద్యం సేవించి ఓ పార్టీలో రచ్చ చేశారట కదా? అని ఓ నెటిజన్‌ అడిగాడు. ఈ 'అట' అనే పదాలు మీరు సరదాకి అనుకుంటే బాగుంటుందేమోనని అనసూయ సమాధానమిచ్చింది. అయితే, నిజాలు వేరే ఉంటాయని, పరిణతి చెందితే నీకు కూడా అర్థమవుతుంది.. అని ఆమె మండిపడింది. తనకు తెలిసి ఆ నెటిజన్‌ ఇంకా పరిణతి చెందలేదని పేర్కొంది.

తన చేతిపై ఉన్న టాటూకి అర్థం ఏమిటి? అని ఓ నెటిజన్ అడగగా, అను సమాధానం చెబుతూ, 'బ్యూటీ సోల్ డీప్‌' అని తెలిపింది. అనసూయ అన్నది తమ నానమ్మ పేరని, అందుకే తనకు ఆ పేరు పెట్టారని చెప్పింది. తమ స్వస్థలం నల్గొండ అని తెలిపింది. జబర్దస్త్‌లో తన కొత్త ఎపిసోడ్స్‌ లేవని తెలిపింది.